హైదరాబాద్ (ఫిబ్రవరి – 08) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ బోర్డు టీ – శాట్ నిపుణ ఛానల్ సహకారంతో ఫిబ్రవరి 9 నుండి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలలో పాటించాల్సిన చిట్కాలు మరియు మోటివేషనల్ తరగతులను ప్రముఖ సైకాలజిస్ట్ ల చేత అందిస్తున్నారు.
కావున విద్యార్థులు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిపుణ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి పబ్లిక్ పరీక్షలను ఆహ్లాదకర వాతావరణంలో రాయాలని ఇంటర్మీడియట్ కమిషనర్ పేర్కొన్నారు.