Home > BUSINESS > FORBES – అత్యంత శక్తివంతమైన కరెన్సీ సూచిక

FORBES – అత్యంత శక్తివంతమైన కరెన్సీ సూచిక

BIKKI NEWS (JAN. 18) : ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన కరెన్సీగా (MOST POWERFUL CURRENCY INDEX 2024 BY FORBES) కువైట్‌ దినార్‌ నిలిచింది. అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే ఒక్క దినార్‌ విలువ 3.25 డాలర్లుగా ఉన్నది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్‌ జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో అమెరికన్‌ డాలర్‌ 10వ ర్యాంకు, ఇండియన్‌ రూపాయి 15వ స్థానంలో నిలిచాయి. డిమాండ్‌-సైప్లె, ద్రవ్యోల్బణం, దేశీయ ఆర్థిక వృద్ధి, కేంద్ర బ్యాంకుల పాలసీలు తదితర అంశాలను విశ్లేషించి ఈ ర్యాంకులను కేటాయించారు.

1) కువైట్ దీనార్
2) బహ్రెయిన్ దీనార్
3) ఒమన్ రియాల్
4) జోర్డానియన్ దీనార్
5) జిబ్రాల్టర్ పౌండ్
6) బ్రిటిష్ పౌండ్
7) కెమన్ ఐలాండ్ డాలర్
8) స్విస్ ఫ్రాంక్
9) యూరో
10) అమెరికా డాలర్
15) ఇండియా రూపాయి