క్రమబద్ధీకరణ సాద్యం కాకపోతే ఉద్యోగ భద్రత కల్పిస్తాం – హరీష్ రావు

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్య స్వర్ణోత్సవాల సభ సిద్దిపేట లో ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హజరయిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య తెలంగాణ వచ్చినంక బలోపేతం అయినదని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఉచిత విద్య కారణంగా 60 వేల నుండి రెండు లక్షలకు పెరిగిందని ఈ గొప్పతనం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందిది అని కొనియాడారు. జాతీయ స్థాయి పరీక్షలలో మన విద్యార్థులు ప్రతిభ చూపుటకు కారణం ఇంటర్మీడియట్ విద్య అని తెలిపారు.

అలాగే జూనియర్ కళాశాలలో ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్ధికేతర సమస్యలను అతి త్వరలోనే ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

జూనియర్ లెక్చరర్ కు ప్రిన్సిపాల్ గా పదోన్నతులు కల్పించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల నెలనెలా జీతం ఇవ్వడానికి సీఎం ఆదేశించారని అతి త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు.

ముఖ్యమంత్రి హమీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొరకు జీవో నెంబర్ 16 విడుదల చేశామని అది కోర్ట్ పరిధిలో ఉన్న నేపథ్యంలో దానిని వెకేట్ చేపించడానికి ప్రయత్నిస్తామని, ఆలోపు రెగ్యులర్ లెక్చరర్ లకు సమానంగా బెనిఫిట్స్ అందిస్తూ, ఉద్యోగ భద్రత కల్పించడానికి కృషి చేస్తానని ఆ విషయం మీద అధ్యయనం సాగుతుందని తెలియజేశారు.

ఇప్పటికే 12 నెలల వేతనం మరియు బేసిక్ పే అందిస్తున్నామని తెలియజేశారు.

ఎంటీఎస్ జూనియర్ లెక్చరర్ ల క్రమబద్ధీకరణ అంశం మీద తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అతిథి అధ్యాపకుల రెన్యూవల్ విషయం పరిశీలస్తామని తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్య అబివృద్ది కి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Follow Us@