కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా వేతనాలకై రివ్యూ మీటింగ్

తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ లలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా వేతనం చెల్లించే అంశాన్ని పరిశీలించడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది.

తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం పై స్పష్టమైన వైఖరితో ఉందని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు నెల నెలా సమయానికి వేతనం ఇచ్చే అంశాన్ని పరిశీలించడానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఈ నెల 24వ తేదీ నుండి ఆన్ లైన్ ద్వారా వర్చువల్ విధానంలో రివ్యూ మీటింగ్ కి హాజరు కావాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేర్కొన్నట్లు సమాచారం.

ఆన్లైన్ వర్చువల్ మీటింగ్ మే 24వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సమాచారం.

అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమాచారంతో ఈ మీటింగ్ లకు హాజరు కావాలని పేర్కొనడం జరిగింది.

బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ అంశం తెర మీదకు వచ్చింది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానం లో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నాలుగు నెలల తర్వాత వేతనాలు రావడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి గందరగోళం గా ఉంటుంది కావున ఏలాగు ఇచ్చే జీతాలను నెల నెల ఇవ్వాలని సీఎం కేసీఆర్ కూడా పేర్కొన్న నేపథ్యంలో త్వరలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెల నెలా సమయానికి వేతనాలు వచ్చే అవకాశం ఉంది.

pdf

Follow Us@