త్వరలో నెలనెలా వేతన జీవో

తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ ల సంఘం తరపున (TGDCLA-900) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వినోద్ కుమార్ అద్వర్యంలో ఈ రోజు ఆర్ధికమంత్రి హరీశ్ రావుని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సంధర్భంగా నెల నెలా వేతనాల గురించి విన్నవించడం జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు త్వరలోనే నెల నెలా వేతనాలకు సంబంధించిన G.O విడుదల అయ్యే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు.

ఈ రోజు మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర TGDCLA-900 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.వినోద్ కుమార్, రాష్ట్ర నాయకులు Dr.శ్రద్దానందం, శశిధర్, చందు, హరి, లక్ష్మణ్, సంగీత పాల్గొన్నారు.

Follow Us@