కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నెలనెల వేతనాలకు ఆర్థిక శాఖ చర్యలు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికి కూడా కొన్ని కారణాల వల్ల నెలనెలా వేతనాలు అందని విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆర్ధిక శాఖ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు 2021 – 22 ఆర్థిక సంవత్సరం లో రెన్యూవల్ కాబడిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గౌరవ వేతనాలకు సంబంధించిన వివరాలు సెప్టెంబర్ 30వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని కోరారు.

అలాగే ప్రతి సంవత్సరం సాదరణంగా రెన్యూవల్ అవుతూ ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలను రెన్యూవల్ తో సంబంధం లేకుండా చెల్లించాలని సూచించారు

నెలనెలా వేతనాలు ఆలస్యం కాకుండా IFMIS పద్ధతిలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని DTA, DWA, DSA, PAO, డ్రాయింగ్ & డిస్ర్టిబ్యూటింగ్ అధికారులను ఆదేశించారు.

FINANCE MEMO

Follow Us @