‘ఆదర్శ’ టీచర్ల బదిలీల పట్ల హర్షం – PMTA TS

హైదరాబాద్ ( జూలై – 04) : సుమారు 10 సంవత్సరముల కాలంనుండి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో పలుమార్లు సంఘం తరుపున ప్రాతినిధ్యం చేయగా నేడు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసికొని మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదల చేసి నందుకు గాను ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( PMTA TS) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి, విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ గారికి, కమీషన్ మేడం దేవసేన గారికి, మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.

జూలై 5 నుండి మోడల్ స్కూల్ టీచర్లు బదిలీల ప్రక్రియ ఆన్లైన్ పద్దతిలో మొదలు కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.