మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లిన PMTA అధ్యక్షుడు తరాల జగదీష్

ఎమ్మెల్సీ లు జనార్ధన్ రెడ్డి, రఘోత్తం రెడ్డి ఆధ్వర్యంలో PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ మరియు ఇతర సభ్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుని కలసి మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల వేతన బకాయిల సమస్యల గూర్చి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మోడల్ స్కూల్ లలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయుల వేతన డిఫర్మెంట్ అమౌంట్, DA బకాయిలు , CPS మ్యాచింగ్ గ్రాంట్ కు సంబంధించిన బడ్జెట్ విడుదల చేయాలని, TSGLI ని త్వరితగతిన పునరుద్ధరించాలని మంత్రిని కోరడం జరిగింది.

మంత్రి హరీష్ రావు స్పందిస్తూ త్వరితగతిన బకాయిల చెల్లింపులకు కావలసిన బడ్జెట్ ను విడుదల చేస్తామని, ఇతర సమస్యలను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీని ఇచ్చారు.

అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ ను కలిసి చర్చించడం జరిగింది. వారు స్పందిస్తూ త్వరలో మోడల్ స్కూల్ టీచర్స్ బదిలీలు చేపడతామని, మోడల్ స్కూల్ టీచర్స్ TSGLI కు వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని, అదేవిధంగా నోషనల్ సర్వీసు పై లీగల్ ఒపీనియన్ తీసికొన్న తరువాత పరిష్కారం చేస్తామని తెలిపారు.

అదేవిధంగా అవర్లీ బేసిక్ ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలని కోరడం జరిగింది

ఈ కార్యక్రమలలో PRTU రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు మరియు PMTA TS రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కెనపల్లి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, సతీష్ అగర్వాల్ రెడ్డి, వేణు లు పాల్గొన్నారు

Follow Us@