ఎమ్మెల్సీ అలుగబెల్లి నర్సిరెడ్డి పాదయాత్రకు సంపూర్ణ మద్దతు – కొప్పిశెట్టి సురేష్

  • పిఆర్సి వెంటనే ప్రకటించాలి.
  • కాంట్రాక్టు అధ్యాపకుల స్థానచలనం మార్గదర్శకాలు ప్రకటించాలి.
  • కొప్పిశెట్టి సురేష్ డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, పీఆర్సీ అమలు మరియు ఇతర సమస్యల పరిష్కారం కొరకు ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 16 వరకు నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టనున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ, టీచర్ ఎమ్మెల్సీ అలుగబెల్లి నర్సిరెడ్డి పాదయాత్రకు తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు జి రమణా రెడ్డి ,డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు మూడు లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పని చేస్తున్నారని, కానీ ఆర్థికంగా మరియు ఉద్యోగ భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యలపై అనేకసార్లు అధికారులకు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. తెలంగాణ తొలి పిఆర్సి ఇంతవరకూ ప్రకటించక పోవడం వల్ల కాంట్రాక్టు ఉద్యోగులు/ లెక్చరర్లు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పి. ఆర్. సి . ప్రకటించి రెగ్యులర్ ఉద్యోగులతో పాటే వెంటనే కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని, అదేవిధంగా D.A & H.R.A. వర్తింపచేయాలని తెలిపారు. ఈ సమస్యపై పిఆర్సి కమిటీకి మరియు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా వినతి పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు.

అదేవిధంగా 13 సంవత్సరాలుగా స్థానచలన లేక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయంలో గత మూడు సంవత్సరాల నుంచి అనేకసార్లు ప్రభుత్వానికి అధికారులకు విన్నవించినా, సీఎం ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన జూనియర్ కాలేజ్ లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల స్థాన చలనము జరగక ఆవేదన చెందుతున్నారని, ఆర్థికంగా ఏమాత్రం ప్రభుత్వంపై భారం పడని స్థానచలన విషయాలో కూడా అధికారులు మొండి వైఖరి అవలంభిస్తున్నారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో

కాంట్రాక్టు ఉద్యోగులు మరియు ఇతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళటానికి టీచర్ ఎమ్మెల్సీ A. నర్సిరెడ్డి నల్గొండ నుంచి హైదరాబాద్ వరకు ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 16 వరకు చేపట్టబోయే పాదయాత్రకు తమ సంఘం ప్రతినిధులు కూడా పాల్గొంటారని రాష్ట్ర నాయకులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, నాయిని శ్రీనివాస్, దేవేందర్, కురుమూర్తి , గోవర్ధన్, గంగాధర్, సయ్యద్ జబీ ఉల్ల, సాయిలు , కె పి శోభన్ బాబు, కాంపల్లి శంకర్, వైకుంఠం, ప్రవీణ్ మధుకర్, మల్లేశం, సైదులు, ఖాసిం , శైలజ, సంగీత, ఉదయశ్రీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు తెలిపారు.

Follow Us@