MIvsSRH : గెలుపుతో ముంబై ప్లేఆప్స్ ఆశలు సజీవం

ముంబై (మే – 21) : ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి ప్లేఆప్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ముంబై జట్టు గ్రీన్ సూపర్ సెంచరీ తో 18 ఓవర్లలోని లక్ష్యాన్ని చేధించింది.

ముంబై ప్లే ఆప్స్ చేరాలంటే బెంగళూరు జట్టు గుజరాత్ ల మధ్య జరిగే మ్యాచ్ మీద ఆధారపడి ఉంది బెంగళూరు జట్టు గెలిస్తే ముంబై ప్లేఆఫ్స్ ఆశలు రన్‌రేట్ మీద ఆధారపడి ఉంటుంది.. ముంబై గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేట్ అయింది.