BIKKI NEWS (MAECH 10) : MISS WORLD 2024 – KRYSTYNA PYSZKOVA – ప్రపంచ సుందరి 2024 పోటీలలో చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టీనా పిజికోవా విజేతగా నిలిచింది. ముంబై లో జరిగిన ఈ అందాల పోటీలలో 24 ఏళ్ల క్రిస్టీనా పిజికోవాను విజేతగా ప్రకటించారు.
ప్రపంచ సుందరి 2023 టైటిల్ విజేత కరోలినా ఈ సుందరి కి కీరిటాన్ని అలంకరించింది. మిస్ వరల్డ్ 2024 రన్నర్ గా లెబనాన్ సుందరి యాస్మికా జెటౌన్ నిలిచింది.
భారత్ కు చెందిన ఫెమినా మిస్ ఇండియా విజేత సిని శెట్టి 5వ స్థానంలో నిలిచింది. 28 సంవత్సరాల తర్వాత భారత్ ప్రపంచ సుందరి పోటీలకు ఆతిధ్యం ఇచ్చింది.