Home > CURRENT AFFAIRS > AWARDS > MISS UNIVERSE 2023 – షెన్నీస్ పాలకియాస్

MISS UNIVERSE 2023 – షెన్నీస్ పాలకియాస్

BIKKI NEWS (నవంబర్ – 19) : 72వ MISS UNIVERSE 2023 పోటీలలో విశ్వసుందరి – 2023 గా నికరగ్వా కు చెందిన సుందరి షెన్నీస్ పాలకాయిస్ (MISS UNIVERSE 2023 – sheynnis palacios) నిలిచింది. 2022 మిస్ యూనివర్స్ ఆర్ బోని గాబ్రియోల్ నూతన విశ్వసుందరికి కిరీటాన్ని అలంకరించింది..

ఎల్ సాల్వడార్ లో ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలలో 90 దేశాలకు చెందిన అందగత్తెల మద్య జరిగిన పోటీలలో విశ్వ సుందరి కిరీటం కైవసం చేసుకుంది.

టాప్ – 3 లో థాయిలాండ్, ఆస్ట్రేలియా, నికరగ్వా దేశాలకు చెందిన సుందరిమణులు చోటు సంపాదించుకున్నారు. వీరిలో సెకండ్ రన్నరప్ గా ఆస్ట్రేలియా సుందరి నిలిచింది. ఫస్ట్ రన్నరప్ గా థాయిలాండ్ సుందరి నిలిచింది.

భారత్ నుండి చండీగఢ్ చెందిన శ్వేత శారద (Swetha Sharada) ఈ పోటీల్లో పాల్గొంది. టాప్ – 20 లో చోటు సంపాదించుకుంది. శ్వేత శారద మిస్ దివా – 2023 పోటీలలో విజేతగా నిలిచింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు