BIKKI NEWS (FEB. 03) : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నేడు సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో భేటీ (minority 4% reservation and others issues) అయ్యారు. ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ, శ్రీ వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని, మైనారిటీ పాఠశాలల అభివృద్ధికి తగిన బడ్జెట్ కేటాయించాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడటంతో పాటు శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు.
మైనారిటీల సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత తనదేనని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీఎం హామీపట్ల మైనారిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.