ముఖ్యమంత్రి సహసోపేత నిర్ణయానికి మార్గం సుగమం – మంత్రి హరీష్ రావు

  • హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలిసిన కనకచంద్రం బృందం
  • క్రమబద్ధీకరణ పూచి నాది – హరీష్ రావు
  • జీవో నంబర్ -16 అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ పై సంతోషం

తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నత విద్య జేఏసి చైర్మన్ సీహెచ్ కనక చంద్రం ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుని ఈ రోజు పలు జిల్లాల కాంట్రాక్టు అధ్యాపకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా హైకోర్టులో జీవో నెంబర్ 16 పై వ్యతిరేకంగా వేసినటువంటి పిల్ ను కొట్టివేసిన విషయం తెలుపుతూ ఈ విషయం మలో ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరించినందుకు యావత్ కాంట్రాక్టు అధ్యాపకుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలను కనకచంద్రం తెలపడం జరిగింది.

అలాగే న్యాయపరమైన అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఆగిపోయిన క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని విన్నవించుకున్నారు.

మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావుమాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయానికి మార్గం సుగమం అయిందని అతి త్వరలోనే కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామని ఈ అంశానికి సంబంధించిన పూర్తి బాధ్యత కూడా నాదే అని తెలిపారని కనకచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ,జిల్లా నాయకులు భారీ ఎత్తున పాల్గోన్నారు.

Follow Us @