Home > EMPLOYEES NEWS > Minimum Wages – కార్మికులకు కనీస వేతనాల ఖరారు

Minimum Wages – కార్మికులకు కనీస వేతనాల ఖరారు

BIKKI NEWS (JAN. 30) : రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వివిధ రంగాల కార్మికుల కనీస వేతనాలను ఖరారు చేస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని ఉత్తర్వులు (minimum wages for private sector employees) జారీ చేశారు

తాజాగా ఖరారు చేసిన వేతనాల కన్నా ప్రస్తుతం ఎక్కువ వేతనాలు పొందితే ఆ వేతనాలనే కొనసాగించాలని స్పష్టం చేసింది.

ప్రైవేటు విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది, పేపర్‌, పేపర్‌బోర్డులు, చేతితో పేపర్‌ తయారీ ఉత్పత్తుల కర్మాగారాలు, పెట్రోలు బంకులు, కోళ్లఫారాలు, హేచరీలు, దాణా ఉత్పత్తి సంస్థలు, ప్రింటింగ్‌ ప్రెస్‌లు, ప్రైవేటు మోటారు రవాణా సంస్థలు, కల్లుగీతా కార్మికులు, కల్లు దుకాణాల్లో పనిచేసేవారు, టింబర్‌ డిపో, సున్నపురాయి బట్టీలు, మార్కెటింగ్‌ సొసైటీలు, సహకార సొసైటీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు, ఉక్కు ఆధారిత పరిశ్రమలు, మైకా, సిమెంటు కర్మాగారాల్లోని కార్మికులకు కనీస వేతనాలు, నివాసభత్యం నిర్ణయిస్తూ కార్మికశాఖ నిర్ణయం తీసుకుంది.

ప్రతినెలా 26 రోజుల పనిదినాలు, రోజుకి ఎనిమిది గంటల పని సమయాన్ని ఖరారు చేసింది. ఒకే పనికి మహిళలు, పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలని ఆదేశించింది.

నగరాలు, పట్టణాలు, గ్రామాల ప్రాతిపదికన ప్రైవేటు విద్యా సంస్థల్లో కనీస వేతనాలు రెండు జోన్లుగా విభజించింది.

విద్యాసంస్థ క్యాంపస్‌ ఇన్‌ఛార్జికి జోన్‌-1లో రూ.36082, జోన్‌-2లో రూ.31,918గా ఖరారు చేసింది.

పెట్రోలు బంకుల్లో సేల్స్‌మెన్‌కు నెలకు రూ.12,304, పంపు అటెండర్‌కు రూ.12,096,

కోళ్లఫారాల్లో వర్కర్లకు నెలకు రూ.11,521,

హెవీ వెహికల్‌ డ్రైవర్‌కు నెలకు రూ.13,093,

లైట్‌మోటార్‌ వెహికల్‌ డ్రైవర్‌కు రూ.12,057గా నిర్ణయించింది