ఇంటర్ పూర్తైన విద్యార్థులకు MHRD మెరిట్ స్కాలర్ షిప్

హైదరాబాద్ (ఆగస్టు – 20) : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, MHRD – నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌ కోసం ప్రెష్ మరియు రెన్యూవల్ దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తుకు చివరి తేదీ
అక్టోబర్ 31 2022 గా విధించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాదించిన విద్యార్థులు అర్హులు. 54,458 మంది అర్హుల జాబితాను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులో ఉంచింది.

2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ తాజా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు జాతీయ స్కాలర్‌షిప్ కోసం ఇంతకు ముందు ఎంపికైన విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి తమ స్కాలర్‌షిప్ దరఖాస్తులను పునరుద్ధరించుకోవచ్చు.

కింద ఇవ్వబడిన వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

http://scholarships.gov.in

టాప్ 20వ పర్సంటైల్ సాదించిన తాత్కాలికంగా ఎంపిక చేయబడిన అభ్యర్థుల జాబితాను కింద ఇవ్వబడింది.

MHRD MERIT LIST

Follow Us @