BIKKI NEWS (SEP. 21) : Merging of schools and teachers adjustment guidelines. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Merging of schools and teachers adjustment guidelines
ఇదే క్రమంలో ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే రెండు స్కూళ్లను విలీనం చేసే అధికారాన్ని జిల్లా యంత్రాంగానికి అప్పగించారు.
తాజా యూడైస్ డేటాను పరిగణనలోనికి తీసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలని సూచించారు. చాలా స్కూళ్లలో విద్యార్థులున్నా, టీచర్లు ఉండటం లేదని, టీచర్లు ఎక్కువగా ఉన్నచోట విద్యార్థులు ఉండటం లేదని గుర్తించారు. టీచర్లు లేని స్కూళ్లలో విద్యార్థులు చేరినా, తిరిగి వారు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోతున్నారని చెప్పారు. దీన్ని నివారించేందుకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒకే కాంప్లెక్స్ లో రెండు స్కూళ్లు ఉంటే, వాటిని విలీనం చేసేందుకు విద్యాశాఖ అనుమతించింది. ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లు ఉండాలో విద్యాశాఖ సూచించింది.
ప్రైమరీ స్కూల్స్
విద్యార్థులు – ఉండాల్సిన టీచర్స్ సంఖ్య
1 – 10 : 01
11 – 60 : 02
61 – 90 : 03
91 – 120 : 04
121 – 150 : 05
151 – 200 : 06
అప్పర్ ప్రైమరీ & హైస్కూలు
1 – 20 : 02 (లాంగ్వేజ్ – 1, సబ్జెక్టు – 1)
21 ఆపైన : 4 గురు సబ్జెక్టు టీచర్లు