JOB MELA : సెప్టెంబర్ 20న జనగామలో మెగా జాబ్ మేళా

జనగామ (సెప్టెంబర్ – 19) : జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు సెప్టెంబర్ 20వ తేదీన జనగామ లోని బృందావన్ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో మెగా జాబ్ మేళా (mega job mela in janagama on 20th september) నిర్వహించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు..

ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాలో సుమారు 80 కంపెనీలు పాల్గొంటాయాని 13 వేల ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పదో తరగతి ఆపైన చదువుకున్న విద్యార్థులు, ఎలాంటి విద్యార్హతలు అవసరం లేకుండా కూడా కొన్ని జాబ్స్ కల్పిస్తున్నామని, సంబంధిత సర్టిఫికెట్లతో వచ్చి జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.