ఒకేషనల్ కోర్సులు చేసిన అభ్యర్థులకు మెగా అంప్రెటిషిప్ మేళా : ఇంటర్ బోర్డ్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 6) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు మెగా అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఏర్పాట్లు చేసింది.

అభ్యర్థులు ఒక సంవత్సరం అప్రెంటిషిప్ ఒక సంవత్సరం అప్రెంటిస్ సౌకర్యం కల్పించి… తరువాత ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ అప్రెంటిషిప్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ, మహబూబ నగర్, వరంగల్ హైదరాబాదులోని నాంపల్లి జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 9, 13, 15, 20వ తేదీలలో ఈ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

కావున ప్రస్తుత సంవత్సరం ఇంటర్మీడియట్ వొకెషనల్ పూర్తి అయిన మరియు గత సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ మేళాను వినియోగించుకోవాలని సూచించారు.

Follow Us @