మెడికల్ విద్యార్థుల స్టైఫండ్ పెంపు

హైదరాబాద్ (మే – 27) : మెడికల్ విద్యార్థులకు అందించే స్టైఫండ్ ను 15శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి పెరిగిన స్టైఫండ్ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

MBBS/BDS హౌస్ సర్జన్లతో పాటు పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సుల చదివే వారితో పాటు సీనియర్ రెసిడెంట్లకు పెంచిన స్టైఫండ్ అమల్లోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.