MBBS, BDS ADMISSIONS నోటిఫికేషన్ – కాళోజీ వర్శిటీ

హైదరాబాద్ (జూలై – 06) : తెలంగాణ రాష్ట్రంలో MBBS, BDS ADMISSIONS COUNSELING 2023 కు కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ (KNRHUS) నోటిఫికేషన్ విడుదల చేసింది.

కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి జూలై 7 నుంచి 14 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది.

NEET UG 2023 పరీక్షలో కటాఫ్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనుంది. ఇప్పటికే రాష్ట్ర మెరిట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దరఖాస్తు ఫీజు 3500/- (SC, ST – 2,900/-)

NEET UG 2023 CUT OFF MARKS CATEGORY WISE

GENERAL/EWS – 137

SC/ST/BC/PWD – 107

PWD – OC – 121

◆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు వెబ్సైట్ : https://tsmedadm.tsche.in/