జనగాం/కళ్ళెం (ఫిబ్రవరి 07) : Matha Ramabai Jayanthi. ఈరోజు మాత రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు కళ్ళెం అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మబ్బు క్రాంతి కుమార్ మాదిగ ఆధ్వర్యంలో మాత రమాబాయి అంబేద్కర్ కీ నివాళులు అర్పించడం జరిగింది.
Matha Ramabai Jayanthi.
ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ… ప్రపంచ మేధావిని తీర్చి దిద్దిన ధిశాలి, త్యాగశీలి మాత రమాబాయి అంబేద్కర్ గారు, అంబేద్కర్ గారి జీవిత సహచరిగా, ఆయన జీవితంలో, భారత రాజ్యాంగం నిర్మాణం లో, హక్కుల కోసం చేసిన ఉద్యమంలో ప్రతిఘట్టంలో మాతా రమాబాయి అంబేద్కర్ త్యాగం వెలకట్టలేనిదని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మబ్బు అశోక్, ఉపాధ్యక్షులు మబ్బు భాస్కర్, మబ్బు అశోక్ మరియు యువకులు నాగరాజు, మల్లేష్, రాజు, విజయ్, కనకరాజు, అజయ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
- UGC NET JUNE 2025 నోటిఫికేషన్ – దరఖాస్తు లింక్
- IND PAK WAR – పాక్ ప్రధాని ఇంటి సమీపంలో దాడి
- INDIA PAK WAR – కరాచీ పోర్ట్ పై భారత్ దాడి
- INDO PAK WAR – త్రివిధ దళాలతో దాడికి సిద్దమవుతున్న భారత్.!
- INDO PAK WAR – యుద్ధం ఆరంభం