కేజీబీవి టీచర్లకు ప్రసూతి సెలవులు

ఉపాద్యాయుల పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఎమ్మెల్సీ లు జనార్దన్ రెడ్డి, రఘోతం రెడ్డి ల ఆద్వర్యంలో PRTU TS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్ లు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కేజీబీవిలలో పని చేస్తున్న టీచర్ల పలు సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది.

సమస్యల పై సీఎస్ స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని కస్తర్భా గాంధీ విద్యాలయాలలో పని చేస్తున్న టీచర్లకు ప్రసూతి సెలవులు కల్పించడానికి అధికారులకు మౌఖిక అదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే IERP ల స్థానంలో రెగ్యులర్ టీచర్లను నియమించడానికి మరియు హెల్త్ కార్డులు జారీ చేయడానికి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Follow Us @