సికింద్రాబాద్ (నవంబర్ – 08) : సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో 419 మెటీరియల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
◆ పోస్టు పేరు : మెటీరియల్ అసిస్టెంట్ – 419
◆ అర్హతలు : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇంజనీరింగ్/డిప్లొమా (మెటీరియల్
మేనేజ్మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
◆ ఎంపిక విధానం : శారీరక దారుఢ్యం/స్కిల్టిస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థుల ను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఎంపికైన వారిని ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
◆ వయోపరిమితి : 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
◆ పరీక్ష విధానం : ఈ పరీక్ష మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులకు ఉంటుంది.
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు,
- న్యూమరిక్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు – 25 మార్కులు,
- జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు-25 మార్కులు,
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ల నుంచి 50మార్కులకు 50 ప్రశ్నల చొప్పున ఉంటాయి.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
◆ దరఖాస్తులకు చివరి తేదీ : 12.11.2022
◆ వెబ్సైట్ : www.aocrecruitment.gov.in
Follow Us @