మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల స్టేట్ టాపర్లను అభినందించిన కమీషనర్

ప్రభుత్వ జూనియర్ కళాశాల మారేడపల్లి సికింద్రాబాద్ ఇద్దరు విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మరియు అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేశారు.

ఒకేషనల్ ఎం.ఎల్.టి గ్రూపుకు చెందిన భూమిక, ఎం.ఈ.సీ. గ్రూపునకు చెందిన సాయిమృదుల స్టేట్ టాప్ ర్యాంక్ లను సాధించినారు.

ఈ సందర్భంగా భూమిక, సాయిమృదుల లను ఇంటర్మీడియట్ కమీషనర్ ఒమర్ జలీల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి లు కమీషనరేట్ లో పుష్పగుచ్చం అందించి అభినందించారు.

ఈ సందర్భంగా కమీషనర్ ఒమర్ జలీల్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతుందని అందుకు ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలషించారు.

సాయి మృదుల

ఈ కార్యక్రమంలో మారేడుపల్లి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, సిటీ కళాశాల ప్రిన్సిపాల్ అర్షద్ సిద్దిఖి, పలక్ నామా కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్, హలియ కళాశాల ప్రిన్సిపాల్ కవిత, మారేడుపల్లి కళాశాల అధ్యాపకులు స్వప్న, అన్సిజాహన్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us @