మార్చి 13 చరిత్రలో ఈరోజు

◆ సంఘటనలు

 • 1940: భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు.
 • 1955: నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.

◆ జననాలు

 • 1733: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, ఆక్సిజన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1804)
 • 1854: కోలాచలం శ్రీనివాసరావు, నాటక రచయిత, న్యాయవాది. (మ.1919)
 • 1899: బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (మ.1967)
 • 1903: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (మ.2016)
 • 1911: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకులు. (మ.1976)
 • 1937: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
 • 1980: వరుణ్ గాంధీ, భారతీయ జనతా పార్టీ యువనేత.

◆ మరణాలు

 • 1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్.
 • 1955: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్.
 • 1973: ముహమ్మద్ గులాం మొహియుద్దీన్,1948లో భారత విభజన సందర్భంగా విజయవాడలో ఏర్పడిన మతవైషమ్యాల నివారణకు ఆయన నడుం కట్టారు
 • 1990: కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1896)
Follow Us @