మార్చి 11 : చరిత్ర లో ఈ రోజు

★ దినోత్సవాలు

 • 1990 లో సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్ర్య పునరుద్ధరణ రోజు (లిథువేనియా)
 • మోషోషూ డే (లెసోతో)

★ సంఘటనలు

 • 1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
 • 1999 : అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.
 • 2009: వన్డే క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు

★ జననాలు

 • 1915: విజయ్ హజారే, భారత క్రికెటర్ జననం. (మ. 2004)
 • 1922: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (మ.2000)
 • 1926: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (మ.2018)

★ మరణాలు

 • 1689: శంభాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు.
 • 1955: అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ ‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1881)
 • 1970: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (జ.1904)
 • 1979: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తెలుగు సాహితీకారులు. (జ.1893)
 • 2009: విమలా థాకర్, గాంధేయవాది, వినోబా భావే సన్నిహితురాలు.
 • 2009: కె.ఎన్‌.వై.పతంజలి, తెలుగు రచయిత. (జ.1952)
 • 2013: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (జ.1913)
 • 2018: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (జ.1926)
Follow Us @