టోక్యో పారాలంపిక్స్ లో భారత్ కి స్వర్ణం, రజతం

టోక్యో పారాలింపిక్స్ 2020 లో భారత్ కు మరో స్వర్ణ పతకం లభించింది. పురుషుల మిక్స్డ్ 50మీ పిస్టోల్ SH1 విభాగంలో మనీష్ నర్వాల్ బంగారు పతకం సాదించాడు. భారత్ కి ఇది మూడవ స్వర్ణం.

ఇదే ఈవెంట్ లో మరో భారత షూటర్ సింగ్ రాజ్ అధానా రజతం గెలుచుకున్నాడు. ఈ పోటీలో భారత్ కు రెండు పతకాలు సొంతమయ్యాయి. ఇదే పారాలంపిక్స్ లో కాంస్యం కూడా సింగ్ రాజ్ అధానా గెలుచుకున్నాడు. దీంతో రెండు పతకాలు సాదించాడు.

దీంతో టోక్యో పారాలింపిక్స్ లో భారత పతకాల సంఖ్య 15కు పెరిగింది. పతకాల పట్టికలో 34వ స్థానంలో ఉంది.

Follow Us @