BIKKI NEWS : MARS ORBITOR MISSION మంగళయాన్ (mom) ప్రయోగాన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) నవంబర్ – 05 – 2013లో అంగారక గ్రహం గురించి తెలుసుకోవడానికి ప్రయోగించారు.
MARS ORBITOR MISSION
ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ సెప్టెంబర్ – 24 – 2014 నుండి అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశించి పని మొదలు పెట్టింది. అక్టోబర్ – 03 – 2022న దీని పని ముగిసింది.
ఈ మామ్ PSLV-XL-C25 రాకెట్ ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు.
మరోక గ్రహం పైకి మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా పంపిన మొదటి దేశంగా… మొత్తంగా నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. మొదటి ఆసియా దేశంగా నిలిచింది.
అంగారక గ్రహంపై వాతావరణం, ఖనిజాలు, జీవనానికి అనుకూల వాతావరణం గురించి అధ్యయనం చేయడానికి దీనిని ప్రయోగించారు.
మంగళయాన్ కు గుర్తుగా 2,000/- రూపాయల నోట్ పై మంగళయాన్ యొక్క ప్రతిమను ముద్రించారు.