తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌-1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా మామిండ్ల

తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌-1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా మామిండ్ల చంద్రశేఖర్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా హన్మంతనాయక్‌ మూడవసారి తిరిగి ఎన్నికయ్యారు.
మొత్తం 262 మంది వివిధ శాఖల గ్రూప్‌-1 అధికారులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఓటింగ్‌లో పాల్గొన్నారు.

చంద్రశేఖర్‌ గౌడ్‌కు 162 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి అజయ్‌ కుమార్‌కు 100 ఓట్లు వచ్చాయి. గ్రూప్‌-1 అధికారుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉంటామని ఈ సందర్భంగా ఎన్నికైన అధికారులు తెలిపారు. త్వరలో జరిగే సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని నియమిస్తామని వెల్లడించారు.

Follow Us@