మండలికి ఎన్నికైన మహీళామణి ‘వాణీ’ కి శుభాకాంక్షలు – మాలతి

హైదరాబాద్ – రంగారెడ్డి – మహాబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో అఖండ విజయం సాదించిన మహిళా మణి వాణీ దేవి కి మహిళా కాంట్రాక్టు అధ్యాపకుల తరపున హైదరాబాద్ జిల్లా 711 సంఘం అధ్యక్షురాలు మాలతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయానికి హరీష్ రావు, మధుసూదన్ రెడ్డి, కనకచంద్రం నేతృత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా మాలతి మాట్లాడుతూ ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో దాదాపు 90 మంది అభ్యర్థుల నడుమ విజేతగా నిలవడం మహీళా లోకానికి గర్వకారణం అని తెలిపారు

మహిళా దినోత్సవం రోజున జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో పని చేస్తున్న మహీళా అధ్యాపకురాళ్ళంత మహిళ అయినా వాణీ దేవి విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గా వాణీ దేవి గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

Follow Us@