గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న అనాధ, పేద విద్యార్థులకు మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న ఉపకారవేతనాలు వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య అన్నారు.
మంగళవారం రోజున కళాశాలలో మహిళా దినోత్సవం అనంతరం 31 మంది విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఒక్కొక్క విద్యార్థినికి పది వేల రూపాయల చొప్పున మొత్తం కళాశాల విద్యార్థినిలకు మొత్తం మూడు లక్షల రూపాయలు అందించినట్టు మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తెలియజేశారు. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు విద్య పట్ల మరింత శ్రద్ధ చూపే అవకాశం ఉందన్నారు.
అంతకుముందు కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు విక్కీ, శ్రీనివాస్, కళాశాల అధ్యాపకులు కేశెట్టి తిరుపతి, రేమిడి మల్లారెడ్డి, బండ వెంకట కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి తిరుపతి, ప్రసాద్, శ్రీనివాస్, బాలరాజు, నాగలక్ష్మి, రాజ్ కుమార్, రాంప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Follow Us @