మహత్మ జ్యోతిరావు ఫూలే 194వ జయంతి ఉత్సవాలు – మబ్బు పరశురాం మాదిగ

బహుజన పితామహుడు, బలహీన వర్గాల ఆశా జ్యోతి, సంఘ సంస్కరణ నిర్మాణ రూపి, విద్యావేత్త మహత్మ జ్యోతిరావు ఫూలే 194వ జయంతి శుభాకాంక్షలు.

కళ్ళెం గ్రామంలోని అంబేద్కర్ కూడలి వద్ద మబ్బు పరశురాం మాదిగ,మాదిగ ఆలోచన వేదిక వ్యవస్థాపకులు,అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహత్మ జ్యోతిరావు ఫూలే చేసిన సేవలు కొనియాడారు..

సమసమాజ నిర్మాణ స్థాపనకై,సంస్కర్తగా,సమాజానికి ఎనలేని సేవలు అందించారు, అంటరానితనం, అస్పృశ్యత,అసమానతలు రూపుమాపుటకై ఎన్నో ఉద్యమాలు చేసి..వీటి అన్నింటికి కారణం విద్యలేక పోవటమే కారణం అని,గుర్తించి తన సతీమణికి విద్య నేర్పించి తన ద్వారా బడుగు బలహీన వర్గాల మహిళలకు విద్య బుద్దులను అందించిన గొప్ప నాయకుడు, 1848 లో సొంతంగా పాఠశాలను,సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేశాడు..

విద్యయే అన్నింటికి మూల కారణం అని గుర్తించి అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందించే కార్యక్రమానికి తన సతీమణితో కలిసి విద్యావ్యవస్థను బలోపేతం చేసిన గొప్ప నాయకుడు.

ఈ సేవలను గుర్తించి ఆ నాటి మహారాష్ట్ర ప్రభుత్వం వాడేకర్ 1888లో మహాత్మ అనే బిరుదును ప్రధానం చేసింది.
మహాత్మ జ్యోతిరావు ఫూలే సేవలు అనిర్వచనీయం,

ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకుంటూ సమసమాజ నిర్మాణంకై పాటు పడుతూ,కులరహిత సమాజాన్ని నిర్మాణంలో భాగస్వాములం అవుతూ,అట్టడుగు ప్రజల విద్యభివృద్దికి తోడ్పాటునందిస్తాము అని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మబ్బు రమేష్,ప్రధాన కార్యదర్శి మబ్బు కన్నయ్య , కోర్డినేటర్ బాల్నె శేఖర్,నక్కీర్త మహేష్,ఉప సర్పంచ్ మల్లేష్,శ్రీధర్,రాంబాబు,క్రాంత కుమార్,రాజ్ కుమార్ , మీడియా మిత్రులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us @