కేసీఆర్ కి మహా క్షీరాభిషేకం – గాదె వెంకన్న, కుమార్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ గత 13 సంవత్సరాలుగా బదిలీలు నిర్వహించకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.

సమస్య తీవ్రతను గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బదిలీల పట్ల సానుకూలంగా స్పందించి బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేసేలా అధికారులకు ఆదేశించడం జరిగినటువంటి సందర్భంగా యావత్ కాంట్రాక్టు లెక్చరర్స్ కుటుంబాల తరఫున ఈ నెల 22 మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మహా క్షీరాభిషేకం కార్యక్రమము నాంపల్లి లోని ఇంటర్మీడియట్ కమీషనరేట్ ఆవరణలో చేపడుతున్నామని ఆర్జేడీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ లు తెలిపారు.

ఈ సందర్భంగా గాదె వెంకన్న మాట్లాడుతూ కొందరు కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు అక్రమ సంపాదనతో బదిలీలపై అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సమాచారముతో విషప్రచారం చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, మార్గదర్శకాల విడుదలను ఆడ్డుకోవడం జరుగుతుంది. ఇలాంటి ప్రయత్నాలను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకుండా, త్వరగా గైడ్ లైన్స్ విడుదలచేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

Follow Us@