వేలాది మంది బదిలీ బాధితుల సాక్షిగా మహా క్షీరాభిషేకం.

వేలాది మంది ఒప్పంద అధ్యాపకుల సాక్షిగా కేసీఆర్ చిత్రపటానికి మహా క్షీరాభిషేకం కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ కమిషనరేట్ లో విజయవంతంగా కొనసాగుతోంది.

వేలాది మంది బదిలీ బాధితులు ఈ రోజు పలు జిల్లాల నుండి భారీ ఎత్తున దాదాపు 2 వేల మంది తరలి రావడంతో ఇంటర్ కమిషనరేట్ బదిలీ బాధితులు నినాదాలతో మారుమోగుతున్నది.

సీఎం కేసీఆర్ ప్రకటన చేసి నెల గడచిన కూడా మార్గదర్శకాలు విడుదల చేయకుండా ఉండటానికి కారణాలు అర్థం కావడం లేదని కార్యక్రమానికి వచ్చిన అధ్యాపకులు తెలిపారు.

కుటుంబాలతో, పసి పిల్లలతో వచ్చిన మహిళా కాంట్రాక్టు అధ్యాపకురాళ్ళు తమ బాధలు మీడియాకు చెప్పుకుంటూ బదిలీలు అడ్డుకుంటున్నవారికి శాపనార్థాలు పెడుతున్నారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారం వెంటనే జరపాలని కార్యక్రమంలో పాల్గొన్న అతిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Follow Us @