వేలాది బదిలీ వినతి పత్రాలు కమీషనర్ కి అందించాం – గాదె వెంకన్న, యార కుమార్.

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల బదిలీల పై కేసీఆర్ హామీ ఇవ్వడంతో హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కమిషనరేట్ లో ఈరోజు కేసీఆర్ చిత్రపటానికి మహా క్షీరాభిషేకం కార్యక్రమం జరిగింది.

ఈ మహా క్షీరాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది అధ్యాపకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొని కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలకు పూర్తి సంఘీభావం తెలిపి వెంటనే బదిలీలు జరపాలని త్వరగా మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు.

అలాగే కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటర్మీడియట్ కమిషనర్ తో భేటీ కావడం జరిగిందని ఈ భేటీలో బదిలీ మార్గదర్శకాలపై విన్నవించడం జరిగిందని, దీనిపై స్పందించిన కమిషనర్ ఉమర్ జలీల్ బదిలీ భాదితులు ద్వారా అందిన వేలాది బదిలీ వినతి పత్రాలను విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారని గాదె వెంకన్న తెలిపారు.

Follow Us @