విద్యా శాఖ మంత్రి దృష్టికి మహా క్షీరాభిషేకం.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సీజేఎల్స్ బదిలీల పై సీఎం కేసీఆర్ ప్రకటనతో 22వ తేదీ నాంపల్లిలోని ఇంటర్ కమిషనరేట్ లో వేలాది అధ్యాపకులు కేసీఆర్ చిత్రపటానికి మహా క్షీరాభిషేకం చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మహా క్షీరాభిషేకంకు సంబంధించిన వివరాలను ఈరోజు ఆర్జేడీ నియమిత అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ ల ఆధ్వర్యంలో పలువురు అధ్యాపకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హైదరాబాద్ లో వారి స్వగృహం నందు గౌరవప్రదంగా కలిసి వేలాది మంది బదిలీ బాధితులు జిల్లాల నుండి తరలి వచ్చి పాల్గొన్న మహా క్షీరాభిషేకం కార్యక్రమ విశేషాలను వివరించడం జరిగింది.

దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ త్వరలో బదిలీ మార్గదర్శకాలు విడుదల చేస్తామని, దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలియపరచడం జరిగిందని హమీ ఇచ్చారని గాదె వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us@