నేడే కేసీఆర్ కి మహా క్షీరాభిషేకం.

తెలంగాణ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకుల బదిలీల పై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బదిలీల నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది సీజేఎల్స్ ఈ రోజు నాంపల్లి లోని ఇంటర్మీడియట్ కమీషనరేట్ లో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేయనున్నట్లు గాదె వెంకన్న, కుమార్ లు తెలిపారు.

ఈ నిర్ణయంతో 13 సంవత్సరాలుగా అవకాశం ఉండి కూడా కుటుంబాలకు దూరంగా పని చేస్తూ అనుభవించిన వనవాసానికి తెరపడిందని, బదిలీల వలన కుటుంబాలకు దగ్గరగా రావడంతో ప్రభుత్వ కళాశాలల ప్రగతికి రెట్టింపు కృషి చేస్తామని తెలిపారు.

ప్రభుత్వం త్వరగా మార్గదర్శకాలు విడుదల చేసి కళాశాలలు తెరవక ముందే బదిలీలు చేపట్టాలని తద్వారా కళాశాలలు ప్రారంభించాక ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధ్యాపకులు కొత్త కళాశాలలకు అలవాటు పడతారని కావునా వీలైనంత త్వరగా బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయాలని గాదె వెంకన్న, కుమార్ లు తెలిపారు.

Follow Us@