బదిలీల పై ఇంటర్విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి స్పందన.

దేవుడు వరమిచ్చినా పూజారి కనుకరించనట్లు కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల బదిలీల విషయంలో స్వయనా ముఖ్యమంత్రే ప్రకటన చేసి నెల రోజులు గడుస్తున్నా ఇంకా బదిలీ మార్గదర్శకాలు విడుదల కాలేదు.

ఈ అంశంపై తెలంగాణ ఇంటర్విద్యా జేఏసీ కన్వీనర్ డా. మధుసూదన్ రెడ్డి స్పందిస్తూ…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీల మీద విస్పష్ట ప్రకటన ప్రకారం కుటుంబాలకు సుదూర ప్రాంతాల్లో పని చేస్తున్న వారిని కుటుంబాలకు దగ్గరకు బదిలీ చేయడం అనేది ప్రధాన అంశం అని తెలియజేశాలరు. అయితే ప్రకటన వచ్చిన తర్వాత కూడా బదిలీల ప్రక్రియ ముందుకు సాగక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలియజేశారు.

ఏ ప్రభుత్వ శాఖలో అయినా బదిలీ మార్గదర్శకాలు అనేవి శాఖ యొక్క అవసరాలకు అనుగుణంగా లయబుల్ మరియు రిక్వెస్ట్ బదిలీలు ఉంటాయని తెలియజేశారు.

బదిలీల ప్రక్రియను అందరికీ సమ న్యాయం జరగదని, ఎక్కువ కాలం ఒకేచోట పని చేయడం వలన స్థానిక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని అధిక ప్రయోజనాలు పొందడానికి బదిలీలు వద్దు అని కొందరు, సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బదిలీలు కావాలని కోరుకోవడం జరుగుతున్నదని తెలిపారు. అలాగే అధ్యాపక సంఘాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, ఒకే సంఘంలో కూడా భిన్న అభిప్రాయాలు ఉండడం వలన సమస్య సంక్లిష్టంగా మారడానికి కారణం అని అభిప్రాయపడ్డారు. కావున ఈ సమస్యపై ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం అని తెలిపారు.

గతంలో కేజీబీవిలలో కాంట్రాక్టు టీచర్లకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ బదిలీల పై లేనప్పటికీ రీఎంగేజ్మెంట్ పేరుతో బదిలీలు చేశారు. ఇప్పుడు కూడా ఆ పద్దతిలో బదిలీలు జరిపే అవకాశం ఉంది.

అయితే ఇంకా కళాశాలలు తెరుచుకోలేదు, మరియు ఇతర పరిస్థితుల నేపథ్యంలో కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల బదిలీలు వచ్చే విద్యా సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయని డా. మధుసూదన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.

Follow Us @