Home > UNCATEGORY > మంద కృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం జాతికి గర్వకారణం – మబ్బు పరశురామ్

మంద కృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం జాతికి గర్వకారణం – మబ్బు పరశురామ్

  • 30 సంవత్సరాల పోరాటానికి దక్కిన అరుదైన గౌరవం
  • దళిత రత్న మబ్బు పరశురామ్ మాదిగ

BIKKI NEWS (JAN. 30) : Mabbu Parasuram express joy about Padma sri Award for Manda krshna. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల దళితరత్న మబ్బు పరశురామ్ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.

Mabbu Parasuram express joy about Padma sri Award for Manda krshna

ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ… మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మంద కృష్ణ మాదిగకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉప కులాల కోసం గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న మంద కృష్ణ మాదిగకు ప్రజా వ్యవహారాల కింద పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జాతి దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. ఎస్సీ లోని 59 కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఈదురుముడి గ్రామం లో 1994 జులై 7వ తారీఖున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మంద కృష్ణ మాదిగ ఏర్పాటు చేయడం జరిగిందిని గుర్తు చేశారు.

3 దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేస్తూ జాతి కోసం, దివ్యాంగుల ఫించన్ కోసం, చిన్న పిల్లలు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారి కోసం అనేక ఉద్యమాలు చేసారు.

జాతి కోసం అనేక పర్యాయాలు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. వీటి ఫలితంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 7 మందితో కూడిన ధర్మాసనం మాదిగ, మాదిగ ఉప కులాల ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయడం జరిగిందన్నారు.

ఇంకా కొన్ని కుట్రలు చేదించడానికి ఫిబ్రవరి 07 వ తేదీన మహా సంఘీభావ సమావేశం “లక్షల డప్పులు వేయి గొంతులు” ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంఘీభావ సమావేశానికి కవులు, కళాకారులు, మేధావులు కులాలకు, మతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సామాజిక ఉద్యమాలతో ప్రజలలో చైతన్యం కలిగించిన ప్రజా ఉద్యమకారులు మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం హర్షణీయం అని పరశురామ్ మాట్లాడారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు