ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి నగదు ప్రోత్సాహకం

జనగాం (ఆగస్టు – 15) : కళ్లెం గ్రామంలో ఈ రోజు స్నేహ యూత్ ఆధ్వర్యంలో 77వ ఇండిపెండెన్స్ డే సందర్బంగా పాఠశాల పూర్వ విద్యార్థి ప్రభుత్వ అధ్యాపకులు మబ్బు పరశురాం గారు కళ్లెం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో అధిక మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ అయినా సీహెచ్. హారికకు 5,000/- రూపాయలు బహుమతి ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మన పాఠశాల పూర్వ విద్యార్థి అయిన పరశురాం గారు విద్యార్థులకు మెటీరియల్ మరియు నగదు ప్రతి సంవత్సరం ప్రోత్సాహకాలు ఇవ్వడం వలన విద్యార్థులు చదువులో రాణిస్తున్నారు. ప్రతి విద్యార్థి మబ్బు పరుశురాం గారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఊరికి మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్నేహ యూత్ అధ్యక్షులు మబ్బు క్రాంతి కుమార్, పాఠశాల చైర్మన్ కానుగంటి కవిత, టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మబ్బు కరుణాకర్, యూత్ కమిటీ నాయకులు మరియు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.