డా.బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్న లెక్చరర్ మబ్బు పరశురాం

హైదరాబాద్ (ఎప్రిల్ – 02) : ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్కాజ్గిరి అధ్యాపకులు మబ్బు పరశురాంకి అరుదైన గౌరవం దక్కింది. ఈరోజు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డుల ప్రధాన ఉత్సవంలో భాగంగా లెక్చరర్ మబ్బు పరశురాం బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది, ఇందులో భాగంగానే పరశురాం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకోవడం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.

అవార్డు గ్రహీత మాట్లాడుతూ అంబేద్కర్, కాన్సిరాం గార్ల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళుతున్నందుకుగాను నాకు ఈ అరుదైన గౌరవం దక్కిందని ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విమలక్క గారు, రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్, విష్ణు, జ్యోత్స్న, యార కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.