5వ సారి TGDCLA అధ్యకుడిగా వినోద్ కుమార్

  • మరోమారు TGDCLA సంఘం భారీ విజయం
  • అందరి క్రమబద్ధీకరణే ధ్యేయంగా పని చేస్తా

హైదరాబాద్ (ఆగస్టు – 10) : తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ సంఘ ఎన్నికలు నిన్న ఆన్లైన్ ద్వారా జరగగా 246 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. వీరిలో 241 మంది TGDCLA కి ఓటు వేయడం ద్వారా 98 శాతం ఓట్లతో TGDCLA సంగం మరియు అధ్యక్షుడిగా వినోద్ కుమార్ ఎన్నిక కావడం జరిగింది.

ఈ సందర్భంగా యమ్. వినోద్ కుమార్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని 100% పనితో చూపిస్తానని… ప్రధానమైన క్రమబద్ధీకరణ అందరికీ సాధించేవరకు విశ్రమించకుండా ప్రభుత్వ పెద్దలు ,అధికారుల సహకారంతో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

Follow Us @