LRS – 25 శాతం డిస్కౌంట్ తో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు చాన్స్

BIKKI NEWS (MAY 14) : LRS REGISTRATION IN TELANGANA. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంలో బాగాన గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫ్లాట్లకు కూడా LRS దరఖాస్తుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ దరఖాస్తు గడువును జూన్ 30 వరకు తాజాగా పొడిగించారు.

LRS REGISTRATION IN TELANGANA

జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకున్న వారికి 25% రాయితీని కూడా కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం విశేషం.

ఈ మేరకు సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి, దుద్దిల్ల శ్రీధర్ బాబులు తాజా ఆదేశాలు జారీ చేశారు

అనుమతి లేని లేఅవుట్లలో ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ లను గత ప్రభుత్వం నిషేధించింది. దీంతో నాలుగేళ్లుగా ఆ లేఔట్లలో ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు వాటికి కూడా మోక్షం లభించనుంది.

అక్రమ లేఅవుట్ లో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే మిగతా 90% ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్పిస్తారు.

సబ్ రిజిస్టార్ ఆఫీసుల వద్దే ఎల్ఆర్ఎస్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని, అక్కడే ఫీజు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు