Home > TELANGANA > LRS – లే అవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు అవకాశం

LRS – లే అవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు అవకాశం

BIKKI NEWS (FEB. 26) : లే అవుట్ల క్రమబద్ధీకరణకు నూతనంగా దరఖాస్తు చేసుకోవడానికి గడువును మార్చి – 31 వరకు గడువు విధిస్తూ (LRS APPLICATION DATE EXTENDED UPTO 31st MARCH) నిర్ణయం తీసుకుంది.

గతంలో లే అవుట్ల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. మిగిలిపోయిన మిగతా వారి కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకుమార్చి 31 వరకు వీలు కల్పించింది.

దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర అవుట్స్‌ క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల మంది దరఖాస్తుదారులకు లాభం చేకూరనున్నది.

LRS APPLICATION LINK