ఆ జిల్లాలో విద్యా సంస్థలకు రేపు స్థానిక సెలవు

తెలంగాణ రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం ఏర్పాటు చేయబడిన పోలింగ్ స్టేషన్లు ఉన్న విద్యా సంస్థలకు శనివారం అనగా మార్చి 13 వ తేదీ “స్థానిక సెలవు దినం”గా ప్రకటిస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

దీని ప్రకారం 130 పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో శనివారం నాడు పోలింగ్ సామాగ్రిని చేరవేయడానికి అనువుగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పోలింగ్ కేంద్రాలను స్థానిక తహసీల్దార్ కు అప్పగించ వలసిందిగా విద్యాసంస్థలను ఆదేశించడం జరిగింది.

Follow Us@