ఉద్యోగుల స్థానిక అప్షన్స్ ఎంపికకు ఉత్తర్వులు

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను స్థానికత ఆధారంగా పంపకాలు చేయడానికి ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ ఆప్షన్లు ఎంచుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నూతన జోనల్ విధానం ప్రకారం మల్టీ జోనల్, జోనల్, జిల్లా కేటగిరీలుగా ఉన్న పోస్టులకు ఉద్యోగులు స్థానిక జోన్స్ లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ దానికి సంబంధించిన ఆప్షన్లు ఎంచుకునేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ దరఖాస్తు ప్రక్రియ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఉద్యోగులు స్థానికత ఎంచుచుకునే ప్రక్రియలో నూతన కేటగిరిలో ఉన్న ఖాళీలను గుర్తించడం, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల జాబితాను తయారుచేయడం మరియు నూతన స్థానికతకు ఉద్యోగులను కేటాయించడం వంటి దశలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది.

ఉత్తర్వులు కాపీ :: DOWNLOAD

Follow Us @