ప్రభుత్వ జూనియర్ కళాశాలల సిబ్బంది స్థానికత నిర్దారణ ఉత్తర్వులు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పబ్లిక్ ఎంప్లామెంట్ యాక్ట్ – 2018 ప్రకారం స్థానికను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

స్థానికత అనేది జిల్లా, జోనల్ ,మల్టీ జోనల్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి స్థానికతలో 6 క్యాడర్ లను, జోనల్ స్థాయి స్థానికతలో 6 క్యాడర్ లను, మల్టీ జోనల్ స్థాయి స్థానికత లో 5 క్యాడర్ లను గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

జిల్లా స్థాయి కేడర్
1) జూనియర్ అసిస్టెంట్
2) టైపిస్ట్
3) టైప్ మెకానిక్
4) ల్యాబ్ అటెండర్
5) రికార్డ్ అసిస్టెంట్
6) ఆపీస్ సబార్డినేట్

జోనల్ స్థాయి కేడర్
1) సుపరింటెండెంట్
2) ఆడిటర్
3) కంప్యూటర్ టెక్నిషియన్
4) సీనియర్ అసిస్టెంట్
5) సీనియర్ స్టెనోగ్రాపర్
6) సీనియర్ ఇన్ స్ర్టక్టర్

మల్టీ జోనల్ స్థాయి కేడర్
1) అడ్మినిస్ట్రేటీవ్ ఆపీసర్
2) జూనియర్ లెక్చరర్
3) జూనియర్ లెక్చరర్ (వొకేషనల్)
4) లైబ్రేరియన్
5) పిజికల్ డైరెక్టర్

ఇక నుండి చేపట్టబోయే నూతన నియామకం పదోన్నతులు ఈ స్థానికత ఆధారంగానే చేయాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అలాగే ప్రతి నూతన స్థానికత స్థాయిలో క్యాడర్ స్ట్రెంథ్ ను గుర్తించి ఆర్దిక శాఖకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Follow Us @