స్థానిక సంస్థల ఎన్నికల విధులలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలి

BIKKI NEWS (FEB. 08) : Local body elections duties exemption request for gjc staff. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది కి త్వరలో జరగబోవు తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీల, స్థానిక సంస్థ ఎన్నికల విధులలో మినహాయింపు ఇవ్వాలని ఎన్నికల రాష్ట్ర కమిషన్కు వినతి పత్రం పంపినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475, రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్శులు డాక్టర్ వసుకుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.

Local body elections duties exemption request for gjc staff

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థలు ఎన్నికలు శిక్షణకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఎన్నికల కమిషన్
LR NO 94/TGSEC-PR/2025, DT 6/2/2025 అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రోసిడింగ్ జారీ చేయడం జరిగిందని, దీనికి సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే వాళ్ళకి ఈ నెల 10 నుంచి 15 వరకు ట్రైనింగ్ ఉంటుందని తెలపడం జరిగిందని తెలిపారు.

అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ మరియు వార్షిక పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ రావడం జరిగిందని, ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 03 నుంచి ఈ నెల చివరి వరకు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా మార్చి 05 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహణ జరుగుతుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలుపుతూ, ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల, ఆర్థిక భౌతిక పరిస్థితుల వల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఎక్కువ చదవాల్సి ఉంటుందని తెలుపుతూ ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పని చేసే అధ్యాపకులకు ఎన్నికల శిక్షణ మరియు విధులు కేటాయించడం వలన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు పరీక్షల ప్రిపరేషన్ లో ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు.

ఈ విషయాలన్నిటినీ పరిశీలించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు, సిబ్బందికి పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ మరియు విధులు లో మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఈరోజు తమ సంఘము నుంచి తెలంగాణ స్టేట్ ఎన్నికల కమిషన్ కు ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించడం జరిగిందని తెలిపారు.

తెలంగాణ స్టేట్ ఎన్నికల కమిషన్ తో పాటు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు విద్యాశాఖ మంత్రివర్యులు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి మరియు డైరెక్టర్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఆన్లైన్లో వినతిపత్రం పంపించినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయాలన్నీ పరిశీలించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకుల సిబ్బందికి మినహాయింపు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.

ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఎన్నికల సంఘానికి తమ సిబ్బందికి స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ లెటర్ రాయడం జరిగింది. దీనిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోనుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు