Panchayathi Raj Acts – పంచాయతీ రాజ్‌ చట్టం ముఖ్య ఆర్టికల్స్

BIKKI NEWS : పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహత్మ గాంధీ గ్రామ స్వరాజ్య ఆశయం, భారత రాజ్యంగంలో ఆదేశిక సూత్రాలు – 40వ ప్రకరణ లో గ్రామ స్వరాజ్య భావనను(Panchayathi Raj Acts ) పొందుపర్చారు.

స్థానిక సంస్థల ఏర్పాటు అధికారిక వికేంద్రీకరణ పై అనేక కమిటీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అందులో ముఖ్యమైన కమీటీలు…

  • ఆశోక్ మెహతా కమిటీ – 1978
  • జీవికే రావ్ కమీటీ – 1985
  • ఎల్ఎం సింఘ్వీ కమీటీ – 1986

పై కమిటీల సూచన మేరకు స్థానిక సంస్థల ఏర్పాటు కోసం 1992లో 73, 74 రాజ్యాంగ సవరణలు చేశారు. ఇవి స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు కు దోహదపడినవి. ఇవి 1993 లో అమలులోకి వచ్చాయి.

73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి (పంచాయతీ రాజ్)

74వ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి (పురపాలక, నగర పాలక సంస్థలు)

గ్రామ పంచాయతీ కి సంబంధించిన రాజ్యాంగంలో 243 నుంచి 243 (O) వరకు ఆర్టికల్స్ ను ప్రవేశపెట్టారు. వాటి గురించి పూర్తిగా నేర్చుకుందాం…

◆ ఆర్టికల్ – 243 : నిర్వచనాలు

◆ ఆర్టికల్ – 243 ఎ : గ్రామ సభ

◆ ఆర్టికల్ – 243 బి : గ్రామ పంచాయతీల ఏర్పాటు

◆ ఆర్టికల్ – 243 సి : పంచాయితీల కూర్పు

◆ ఆర్టికల్ 243 D : స్థలాల రిజర్వేషన్

◆ ఆర్టికల్ – 243 E : పంచాయతీల పదవీకాలం లేదా వ్యవధి

◆ ఆర్టికల్ – 243 F : సభ్యత్వానికి అనర్హులు

◆ ఆర్టికల్ – 243 G : పంచాయతీల అధికారాలు, అధికారం మరియు బాధ్యతలు

◆ ఆర్టికల్ – 243 H : పన్నులు మరియు వాటి నిధులు విధించే పంచాయతీల అధికారాలు

◆ ఆర్టికల్ – 243 I : ఆర్థిక స్థితి సమీక్ష కోసం ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగం

◆ ఆర్టికల్ – 243 J : పంచాయతీల ఖాతాల ఆడిట్

◆ ఆర్టికల్ – 243 K : పంచాయతీలకు ఎన్నికలు

◆ ఆర్టికల్ – 243 L : కేంద్రపాలిత ప్రాంతాలలో వర్తింపు

◆ ఆర్టికల్ – 243 M : కొన్ని ప్రాంతాలలో ఈ భాగం వర్తించకపోవడం

◆ ఆర్టికల్ – 243 N : ఇప్పటికే ఉన్న చట్టాలు మరియు పంచాయతీల నిర్వహణ

◆ ఆర్టికల్ – 243 – O : పంచాయతీ ఎన్నికల అంశాలకు న్యాయస్థానాల నుండి మహాయింపు